Pages

Monday, November 28, 2011

Generation changes :)

What a difference :)

BACK IN DAYS WHEN WE WERE WRITING LETTERS

Dear Daddy,
How are you and mom doing? How is your health and mom’ health. During last weekend we all friends went to beach and had fun. I am sending you pictures with this letter. ……………………………………………………………………………………………………
……………………………………………………………………………………………………

I am hoping to you see you both soon. I will come home for our next holiday.
Take care and love you both.
Regards,
XXXX


THESE DAYS (LEAVING A VOICEMAIL ON PHONE):

Hey dad, hws it gng .. just checking up on u guys.. me n my girlfriend went to a bar over weekend n it was fun. Check out my facebook for pics.. gotta go… say hi to mom..luv ya.. bye

Saturday, November 26, 2011

26/11 ముంబై దాడులు

26/11 మారణహోమం జరిగి మూడు సంవత్సరాలు అయింది. ఈ మధ్య ఒక website లో మీకు ఈ సంఘటన గురించి ఏ విషయం ఎక్కువ బాధ కలిగిస్తుంది అని అడిగి, మూడు సమాధానాలలో ఒకటి ఎంచుకోమన్నారు.
అవి..
1. కసబ్ ఇంకా బ్రతికి ఉండటం
2. కసబ్ మీద ప్రభుత్వం పెడుతున్న ఖర్చు
3. 26/11 వంటి సంఘటనలు ఇంకా జరుగుతుండటం
ఈ మూడింటిలో నన్ను ఎక్కువ ఇరిటేట్ చేసే విషయం 26/11 సంఘటన తరువాత కూడా మన భద్రతా దళాలు కానీ, పోలీస్ విభాగం కానీ పాఠాలు నేర్చుకొని, అటువంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా చూడలేకపోవటం.
కానీ ఎక్కువ మంది సెలెక్ట్ చేసిన సమాధానం మొదటిది -కసబ్ ఇంకా బతికి ఉండటం (56%), రెండవ స్థానం లో కసబ్ మీద ప్రభుత్వం పెడుతున్న ఖర్చు (28%) మూడవ స్థానం లో నేను అంగీకరించిన సమాధానం (16%)
* * *
చాలా పత్రికలలో ఈ మధ్య చదివాను, కసబ్ మీద ఎన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారో, పెట్టారో అనే విషయం గురించిన వ్యాసాలు. దాదాపు అన్ని వ్యాసాల tone ఒకటే, అది అనవసరమైన ఖర్చు అని. త్వరగా అతన్ని ఉరి తీసేసి, హమ్మయ్య అనేసుకొని, 26/11 నాడు చనిపోయిన, గాయపడిన వాళ్ళకి న్యయం జరిగింది అని ఊపిరి పీల్చేసుకొని మళ్ళీ మన రోజువారీ పనుల్లో పడిపోదాం.. మళ్ళీ అటువంటి మారణ హోమం మరొకటి జరిగే వరకూ.
ఆ దాడుల్లో మరణించిన పోలీస్ అధికారి భార్య ఒకావిడ చెప్పలేని దుఃఖం లో అని ఉంటారు కానీ కసబ్ ని బహిరంగం గా ఉరి తీయాలని అన్నారు. దానిని సపోర్ట్ చేసే వాళ్ళు ఎంతో మంది ఉండే ఉంటారు సందేహం లేదు. నాకు అర్థం కాదు.. ఏమవుతోంది మన లో ఉన్న సంస్కారానికి? అతన్ని చంపాలనే ఆవేశం లో తూ-తూ మంత్రం లాంటి విచారణ జరిపించేసి, అతన్ని ఉరి తీసేస్తే సరిపోతుందా?
9/11 సంఘటనల తరువాత అమెరికా అదే పొరపాటు చేసింది. సరి అయిన ఆధారాలు కానీ కారణాలు కానీ లేకుండా యుద్ధాలకి వెళ్ళారు, ఇంకా ఆ mess లోంచి గౌరవం గా ఎలా బయటకి ఎలా రావాలో తెలీక సతమతం అవుతున్నారు. నిజమే, బిన్ లాడెన్ ని చంపారు. కానీ అమెరికా ఇప్పుడు భద్రం అని చెప్పగలరా?
26/11 సమయం లో మన ప్రభుత్వాం చేసిన ఒకే ఒక మంచి పని, పాకిస్తాన్ మీదకి యుద్ధానికి దిగకపోవటం. ఆ రోజు జరిగిన ప్రాణ నష్టమే కాకుండా మరెంతో మంది సైనికుల ని కూడా కోల్పోయి ఉండేవాళ్ళం. మరి చేసిన తప్పులు అంటే ఎన్నో... ఇంతవరకూ పాకిస్తాన్ ని అంతర్జాతీయ వేదిక మీద సాక్ష్యాలతో సహా నిలదీయలేకపోయాము. అమెరికా, Hadlee సంబంధం ని గట్టిగా నిలదీయలేకపోయాము, ప్రజలకి మళ్ళీ అటువంటి సంఘటనలు జరగకుండా తగిన చర్యలు తీసుకుంటున్నాము అని స్వాంతన కలిగించలేకపోయారు. పైగా, గుజరాత్ లోని పోలీసులు, నరేంద్ర మోడీ ప్రభుత్వాల అరాచకాల వలన పోలీసులు ఎవరైనా టెర్రరిస్ట్ లని అరెస్ట్ చేసాము అన్నా, encounter లో చంపేసాము అన్నా వాళ్ళని నమ్మటానికి సందేహించే పరిస్థితి వచ్చింది.
మన ప్రభుత్వం నిజం గా ప్రజల జీవితాలకి విలువ ఇస్తుందా అని అనుమానం వస్తుంది నాకు ఎప్పుడూ. ఎప్పుడైనా, ఏదైనా ప్రమాదాలు కానీ టెర్రరిస్ట్ దాడులు కానీ జరిగితే వెంటనే నష్టపరిహారం ప్రకటిస్తారు. ఇవ్వవలసిన వాళ్ళకి ఇచ్చేది ఇచ్చి, ఆ డబ్బులు బాధితుల కుటుంబాలకి అందితే అయిపోతుందా ప్రభుత్వం బాధ్యత?
ఇప్పుడు తెలంగాణా గొడవలనే తీసుకోండి. సభ్యత, సంస్కారాలు వదిలేసి, మన సంస్కృతి చిహ్నాలైన విగ్రహాలని సుత్తులతో బాది, పగలకొట్టారు. దాని గురించి ఏమన్నా చేయగలిగిందా ప్రభుత్వం? ప్రత్యేక రాష్ట్రం కోసం అందరూ సమ్మె చేస్తూ మొత్తం రాష్ట్రాన్ని స్థంబింప చేసారు వారాలకొద్దీ. మొత్తం యంత్రాంగం స్థంభించిపోయింది. ప్రభుత్వం ఏం చేసింది? ఏం చేస్తోంది? ఈ blackmailers చేత సమ్మె విరమింపచేయటానికి వాళ్ళకి మరిన్ని తాయిలాలు ఇచ్చి వాళ్ళని పనుల్లోకి వచ్చేట్టు చేసారు రాష్ట్ర ప్రభుత్వం వారు. ఎవరిది బాధ్యత జరిగిన నష్టానికి? ప్రభుత్వం కి నిజం గా ఈ సమస్య ని పరిష్కరించాలనే చిత్తశుద్ధి ఉందా? ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారు? రోజూ వాళ్ళు ఆడే మ్యూజికల్ చైర్స్ ఆటలు చూస్తే అసహ్యం వేస్తుంది. అసలు ఒక రాష్ట్రం ఏర్పాటు కి కావలసిన నిర్ణయం ఒక వ్యక్తి (సోనియా గాంధి) తీసుకోవటం ఏమిటో నాకు అర్థం కాదు. ఆమె అధికార పక్షం పార్టీ ప్రెసిడెంట్, నిజమే. కానీ ఇటువంటి నిర్ణయాలు ఒక వ్యక్తి చేతుల్లో పెడతారా లేక, ప్రజా ప్రతినిధులు పార్లమెంట్ లో లేక కోర్ట్ లో తమ ని ఏ పని చేయటానికి ప్రజలు ఎన్నుకున్నారో ఆ పని, అదే, చట్టాలు చేసి నిర్ణయం తీసుకోవాలా? ఒక్క కాంగ్రెసే కాదు, మిగిలిన పార్టీలు.. తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ ముఖ్యం గా తె.ర.స ఏం చేస్తున్నాయి. సభ్యత, సంస్కారాలు వదిలి నోట్లో నరం లేనట్టు అసభ్య ప్రేలాపనలు వాగడం, లేకా ప్రభుత్వ ఆస్థులని ధ్వంసం చేయటం అంతే కదా?
ఈ చేతకాని ప్రభుత్వం ఈ అల్లర్లని అదుపు చేసి, సమస్య కి పరిష్కారం అయేంత వరకూ సమర్థవంతం గా పాలన చేయలేనప్పుడు గౌరవం గా రాజీనామ చేసి, రాష్ట్రపతి పలన పెట్టాలి.