ఆంటి కర్రప్షన్ బ్యురో అంటూ మనం చాలా సినిమాల్లో చూశాము.
కానీ నిజ జీవితం లో మన చుట్టూ ఉన్న పరిస్థుతుల్నీ మన చుట్టూ జరుగుతున్న అక్రమాల్నీ ఆపటానికి మనం కొంచెం కూడ ప్రయత్నించేట్లేదు.
తండ్రి పదవి లొ ఉన్నప్పుడు దొరికిందే అదనుగా అందినంత డబ్బు ని దోచేసి ఏమీ ఎరగనట్టు తండ్రి పోగానే ఓదార్పు యాత్రలంటూ మొదలెట్టి ప్రజలకి దగ్గరయ్యి, తన తండ్రి ఇక లేడు అని కించిత్ బాధ కూడ ఏ మూలనా లెకుండా గోతి కాడ నక్క లాగా తండ్రి పేరుతో తన సొంత పార్టీ ని స్ధాపించి అప్పటికే దండుకుని తన దగ్గర దాచిన నల్ల ధనం అంతా తెల్లగా మార్చే ప్రయత్నం లొ రకరకాల పరిశ్రమలను స్ధాపించి, తండ్రి అధికారం లో ఉండగా తండ్రి ద్వార లబ్ది పొందిన వాళ్ళ చేత తన పరిశ్రమల్లొ పెట్టుబడులు పెట్టించి తనకంటూ ఒక సామ్రాజ్యాన్నీ, పెద్ద ఇంటినీ, జనాన్నీ అన్నీ సమకూర్చుకున్ని ఆఖరికి అవి అనుభవించే సమయం వచ్చేసరికి పాపం ఆ అవకాసం లెకుండ తన దొంగతనాలన్నీ బయటపడి ఇప్పుడు ఊసలు లెక్కపెడుతున్నాడు.
దొచేసిందంతా ఒక రకంగా చూస్తే ప్రజల సొమ్మే కదా.. చేసిన మోసాలన్నీ ఊరికే పొతాయా??
ఇంత జరిగాక కూడా మళ్ళీ ఏం ఎరగనట్టు తల్లి ప్రచారానికి దిగుతుందట.
ప్రచారం చెయ్యటం వాళ్ళకి సిగ్గు చేటు.
వీళ్ళు గనక పోటీలొ గెలిస్తే అది వోటెర్లకి సిగ్గు చేటు.
చూడాలి మరి జనం ఇప్పుడు కళ్ళు తేరుస్తారొ లేదో.
No comments:
Post a Comment