ప్రియా నీవు వెళ్ళిపోయావు నన్ను ఒంటరిని చేసిఐనా నీవు నాలో వెలిగించి పోయిన
మధురానుభూతుల అగరొత్తుల పరిమళం
నాలో గుభాళిస్తుంటే నేను ఒంటరిని ఎలా అవుతాను?
మండే నా హౄదయపు ఏడారిని పండించిన
నీ ప్రేమ చినుకులే చివరకు నీవు నాకు మిగిల్చిన చిరుకానుకలనుకో
ఈ నా మూసిన కనురెప్పల నుండి రాలుతున్న ఈ కన్నీటి బిందువులకర్దం
నీవు నాకు అందనంత దూరంలో ఉన్నందుకు విషాద బిందువులని చెప్పనా?
లెక నీవు నా ఎదనిండా ఉన్నందుకు ఆనంద సింధులని చెప్పనా?
ఏమని చెప్పను? ఎలా చెప్పను?
No comments:
Post a Comment